కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నల్లగొండ రోడ్డులో గల కల్వర్టు కింద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి పట్టణంలో భిక్షాటన చేసుకునే గుర్తుతెలియని వ్యక్తి ఎండ వేడిమికి తాళలేక, సరైన ఆహారం లేక గురువారం మధ్యాహ్నం కల్వర్టు కింద మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70157, 87126 70226 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.


