యూరియా యాప్‌ను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

యూరియా యాప్‌ను రద్దు చేయాలి

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

మిర్యాలగూడ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు యూరియా యాప్‌ ద్వారా రైతులు యూరియా సప్లై చేయడాన్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 70లక్షల మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అధిక శాతం మంది రైతులు నిరక్ష్యరాస్యులు ఉన్నారని, వీరిలో చాలా మంది రైతుల వద్ద స్మార్ట్‌ఫోన్లు లేవని, కొద్దిమంది వద్ద ఉన్నా యూరియా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోని యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే పరిజ్ఞానం లేదన్నారు. దీంతో వ్యవసాయాధికారులపై, ప్రైవేట్‌ నెట్‌ సెంటర్లపై రైతులు ఆధారపడాల్సి వస్తుందన్నారు. రైతులు తమ వ్యవసాయ పనులు వదిలిపెట్టి యూరియా బస్తాల కోసం క్యూలైన్‌లో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ యూరియా యాప్‌ ఇలానే కొనసాగితే రైతులు బ్లాక్‌ మార్కెట్‌ బాట పట్టాల్సి వస్తుందన్నారు. ఆయన వెంట ఆంగోతు హాతీరాంనాయక్‌, మట్టపల్లి సైదులు, వేణుగోపాల్‌రావు, పులి జగదీష్‌, హమీద్‌షేక్‌ తదితరులు ఉన్నారు.

ఫ రైతుబంధు సమితి జిల్లా మాజీ

అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

ఫ తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలు

Advertisement
 
Advertisement
Advertisement