డిప్లొమా కోర్సులపై 26న అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

డిప్లొమా కోర్సులపై 26న అవగాహన సదస్సు

Apr 23 2026 8:18 AM | Updated on Apr 23 2026 8:18 AM

డిప్లొమా కోర్సులపై 26న అవగాహన సదస్సు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

భువనగిరి : నల్లగొండ బీడీఎఫ్‌, మైత్రి అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా ట్రస్మా సహకారంతో పదోతరగతి విద్యార్థులకు డిప్లొమా కోర్సులపై ఈ నెల 26న భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ వైష్ణవి జూనియర్‌ కళాశాలలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ మదిర మల్లేశం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహించబడుతుందని, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

యాదగిరిగుట్ట : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం యాదగిరిగుట్ట డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదనానరు. ఆర్టీసీలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేసి, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న పే స్కేల్‌, పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. యూనియన్‌లను పునరుద్ధరించి, ప్రైవేట్‌ వ్యక్తులకు ఆర్టీసీని ఇవ్వాలని చూస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండీ ఇమ్రాన్‌, కొల్లూరి రాజయ్య, పేరబోయిన మహేందర్‌, గోరేటి రాములు, కల్లేపల్లి మహేందర్‌, పేరబోయిన బంగారి, సామల భాస్కర్‌, ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగ, ప్రభాకర్‌రెడ్డి, వెంకన్న, జాల నర్సింహ, వెంకటేష్‌, కిషోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి చెంపపెట్టు

ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట : మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ పార్టీపై బురదజల్లి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్‌ ప్రభు త్వ కుట్రలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగిడి సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టులో వందలాది కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, కేవలం రెండు పిల్లర్లు కుంగితే రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లుగా చేసిన గోబెల్స్‌ ప్రచారానికి ఈ తీర్పుతో ప్రజలకు నిజాలు తెలిశాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి తెలంగాణకు ప్రాణేశ్వరమని తెలిపారు.

మహిళలు స్వయం

ఉపాధి పొందాలి

మోత్కూరు : టైలరింగ్‌లో శిక్షణ తీసుకున్న మహిళలు దాంతో స్వయం ఉపాధి పొందాలని డీఆర్‌డీఏ ఏపీడీ కె.జంగారెడ్డి అన్నారు. మో త్కూరు మండల కేంద్రంలోని బుధవారం సెర్ప్‌ (సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పొవర్టీ) వారి సహకారంతో ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో ప్రగతి టైలరింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు మండలాలకు చెందిన 50 మంది స్వయం సహా యక సంఘాల మహిళలకు స్కూల్‌ యూనిఫామ్‌ కటింగ్‌ స్కిల్స్‌పై నాలుగు రోజుల శిక్షణ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే నెలలోగా స్కూల్‌ యూనిఫామ్స్‌ కుట్టి అందజేయాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీపీఎం రవీందర్‌, ప్రోగ్రాం అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రమణ మేడం, మోత్కూరు ఏపీఎం పక్కీరయ్య, ట్రైనింగ్‌ సెంటర్‌ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement