భువనగిరి : ప్రభుత్వ పాఠశాలల భద్రతపై పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల్లో పాఠశాల భవనాలతోపాటు అందులో ఉండే వివిధ పరికరాలు, సామగ్రిని కాపాడుకోవడం విద్యా శాఖకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల భద్రత, పర్యవేక్షణ కోసం రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు చేరవేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. మరలా 2026–27 విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అన్ని పాఠశాలల భద్రత నిమిత్తం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే జిల్లా వ్యాప్తంగా 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జిల్లా పరిషత్‌లతో కలిపి మొత్తం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఆదేశాలు ఇలా..
ఫ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ప్రయోగశాల పరికరాలు, క్రీడా సామగ్రి, గ్రంథాలయ పుస్తకాలు, వాయిద్యాలు వంటి విలువైన వస్తువులను భద్రంగా ఉంచే బాధ్యత ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి.
ఫ సైన్స్, కంప్యూటర్ల ల్యాబ్‌లలో ఉన్న వివిధ పరికరాలపై నిఘా పెట్టాలి.
ఫ మధ్యాహ్న భోజనం కోసం నిల్వ ఉన్న బియ్యం,
ఫ నీటిశుద్ధి యంత్రాలు, మోటార్లు చోరీకి గురికాకుండా జాగ్రత్తగా భద్రపర్చాలి.
ఫ తాత్కాలికంగా రాత్రి సమయంలో కాపలదారులను నియమించుకోవాలి. విద్యా శాఖ, పాఠశాల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలి.
ఫ విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలపై కవర్లు కప్పాలి.
ఫ రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
ఫ కంప్యూటర్లలో ఉన్న డేటాను బ్యాకప్ చేసుకోవాలి.
ఫ ల్యాబ్‌లోని రసాయనాలకు సరిఝైన లేబుల్ వేసి భద్రంగా ఉండే ప్రదేశంలో నిల్వ ఉంచాలి.
ఫ పాఠశాలల ప్రధాన గేట్లకు, గదులకు నాణ్యమైన తాళాలు వేయాలి.
ఫ ప్రతి పాఠశాల వద్ద సంబంధిత మండల పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ ప్రదర్శించాలి.
ఫ వేసవి సెలవుల్లో పర్యవేక్షణకు
విద్యా శాఖ ఆదేశాలు
ఫ ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని తొలిసారి ఉత్తర్వులు
ఫ జిల్లా వ్యాప్తంగా మొత్తం
715 ప్రభుత్వ పాఠశాలలు


