కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి

Apr 23 2026 8:18 AM | Updated on Apr 23 2026 8:18 AM

బొమ్మలరామారం : కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. బొమ్మలరామారం మండలం మాచన్‌పల్లి, మర్యాల, నాయకునితండా, చౌదర్‌పల్లి, పిల్లిగుండ్ల తండా, రామస్వామి తండా, సోలిపేట్‌ గ్రామాల్లో హెచ్‌ఎండీఏ నిధులు రూ.7.36కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులకు శంకుస్ధాపన చేసి మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్ర స్ధానంలో నిలబెడతానన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ ఉనికి కోసమే తనపై బురద చల్లుతున్నారన్నారు. రాజాపేట మండలంలోని స్టోన్‌ క్రషర్‌తో తనకెలాంటి సంబంధం లేదన్నారు. అనంతరం పలు గ్రామాల్లో పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేసి లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు, యాటపోతులను అందజేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బైసు రాజేష్‌, తహసీల్ధార్‌ శ్రీనివాస్‌రావు, ఎంపీడీఓ శ్యామల, పీఏసీఎస్‌ మాజీ చైర్మెన్‌ మోకు మధుసూదన్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దాసరి సూర్యప్రకాష్‌రెడ్డి, ఆయ గ్రామాల సర్పంచ్‌లు సంగి గణేష్‌, శ్రీనివాస్‌ నాయక్‌, భిక్షపతి, పావని, మంగ్తానాయక్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లేష్‌, శ్రీరాములు నాయక్‌, రామిడి జంగారెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి తిరుమల కవిత, పడమటి పావని, మండల మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు యంజాల కళ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌ నాయక్‌ పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

Advertisement
 
Advertisement
Advertisement