విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

Apr 23 2026 8:18 AM | Updated on Apr 23 2026 8:18 AM

రామన్నపేట : విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి ఉన్నత స్థానాలను ఎదగాలని డీఈఓ సత్యనారాయణ సర్పంచ్‌లు కూనూ రు సాయికుమార్‌, పైళ్ల చందన వెంకట్‌రెడ్డి అన్నా రు. బుధవారం బోగారం, ఇస్కిళ్ల ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలను వారు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బోగారం సర్పంచ్‌ సాయికుమార్‌ వి ద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ చేసి ఉత్సాహ పరి చారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌ పైళ్ల చందన, సుమధుర ఫౌండేషన్‌ ప్రతినిధి జీవన, ఉపసర్పంచ్‌ బి. ఉమ, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం డి.స్వామి హెచ్‌ఎంలు శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, ఏఏపీసీ చైర్‌పర్సన్‌ పి.జ్యోతి, ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, సురేష్‌, శ్రీల త, శేఖర్‌, సదానందం, భార్గవి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement