నాంచారమ్మ జాతరకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నాంచారమ్మ జాతరకు ఏర్పాట్లు చేయాలి

Apr 23 2026 8:18 AM | Updated on Apr 23 2026 8:18 AM

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో ఈ నెల 29 నుంచి మే 1వ తేదీ వరకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఎరుకల నాంచారమ్మ బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఆర్‌డీఓ నాగిరెడ్డి, చౌటుప్పల్‌ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎరుకల నాంచారమ్మ బోనాల జాతరపై వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌, ఎరుకలి సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి ఎంపీడీఓ భాస్కర్‌, ఎంపీఓ మాజిద్‌, సర్పంచ్‌ పెరుమాండ్ల మహాలక్ష్మిదానయ్య, ఏఈలు శ్రీనివాస్‌, జగపతి, సాయినాథ్‌రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కొండమడుగు శ్రీనివాస్‌, ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు, నాయకులు కుతాడి మల్లేశ్‌, కుతాడి మహేశ్‌, కుతాడి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement