సాక్షి, యాదాద్రి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు. బుధవారం భువనగిరి కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్లడ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఇంజనీర్లతో సమీక్ష సమావేశం, అనంతరం డీఈఓతో బడిబాట సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే స్లాబ్ లెవెల్ పూర్తయిన వాటికి గృహప్రవేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. గత విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలల వివరాలు తెలియజేసి, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖధికారి కె.సత్యనారాయణ, మండల విద్యాధికారులు,ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు


