యాదగిరి క్షేత్ర దర్శనానికి మంగళవారం వచ్చాం. బుధవారం ఉదయం ఇంటికెళ్దామని బస్టాండ్‌కు వస్తే బస్సుల్లేవు. మధ్యాహ్నం వరకు చూసినా ఒక్క బస్సు రాలేదు. సమ్మె కారణంగా బస్సులు నడిపిస్తలేరని తెలిసింది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
– మాధవి, కామారెడ్డి, ప్రయాణికురాలు
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి జేఏసీ నాయకులతో చర్చించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
– ప్రభాకర్‌రెడ్డి,
జేఏసీ నాయకుడు, యాదగిరిగుట్ట డిపో


