మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ పరిరక్షణకు సమష్టిగా కృషిచేద్దామని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నేత తన్నీరు పాండురంగయ్య అన్నారు. ఈనెల 22 నుంచి చేపట్టనున్న ఆర్టీసీ సమ్మె పోస్టర్‌ను సోమవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆ జేఏసీ చైర్మన్ నర్సింహ, జేఏసీ కన్వీనర్ సోమయ్య, వైస్ చైర్మన్ వెంగల్‌రెడ్డి, ఇన్‌చార్జిర్జీ చంద్రశేఖర్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మెకు ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ, ఎన్‌ఎంయూ, టీఆర్‌ఎస్‌కేవీ, బీఎంఎస్, ఎస్‌టీఎంయే, టీడబ్ల్యూయూ కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డీవీ రత్నం, జి. శ్రీనివాస్, కోటయ్య, పీఎన్ రావు, రంగారెడ్డి, వెంకటేశ్వర్లు, జ్యోతి, సుజాత, కొండలు, రమేష్, శ్రీనివాస్, అశోక్, బాలునాయక్, తీవారి తదితరులు పాల్గొన్నారు.


