కొండమల్లేపల్లి : ద్విచ్ర వాహనాన్ని దొంగతనం చేసిన వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కొండమల్లేపల్లి సీఐ నవీన్‌కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ అజ్మీరా రమేష్‌తో కలిసి సీఐ వెల్లడించారు. నిడమనూరు గ్రామానికి చెందిన మాదగోని ముఖేష్ 30 సంవత్సరాలుగా లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9న అర్ధరాత్రి కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ముఖేష్ మరో వ్యక్తితో కలిసి రెండు ద్విచక్ర వాహనాలను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం వాహనాల తనిఖీ సందర్భంగా ద్విచక్ర వాహనంపై హాలియా నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా అనుమానం రావడంతో విచారించగా బైక్‌లను దొంగలించినట్లు ఒప్పుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేయగా ఇద్దరు వ్యక్తులలో ముఖేష్ పట్టుబడి కాగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించిన ఐడీ పార్టీ హేమునాయక్, భాస్కర్‌లను సీఐ అభినందించారు.


