కోడలి ఆత్మహత్య కేసులో మామ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కోడలి ఆత్మహత్య కేసులో మామ అరెస్టు

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

నల్లగొండ: కోడలిని మానసికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన కేసులో మామను అరెస్టు చేసినట్లు టూటౌన్‌ సీఐ రాఘవరావు తెలిపారు. సోమవారం నల్లగొండ టూటౌన్‌ సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సైదులుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్యకు ఐదు నెలల క్రితం పానగల్‌కు చెందిన శివశంకర్‌తో వివాహమైంది. భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రె లింగయ్య తరుచూ కోడలిని వేధించేవాడు. ప్రతి చిన్న విషయానికి తప్పు పట్టడం, అవమానిస్తూ మానసికంగా హింసించేవాడు. నువ్వు చస్తే నా కొడుక్కు మంచి భార్య వస్తుందని వేధించేశాడు. వేధింపులు భరించలేక ఐశ్వర్య పానగల్‌లోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేశామని సీఐ తెలిపారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 95,108 కింద కేసులు నమోదు చేశామని, నిందితుడు లింగయ్యను సోమవారం అరెస్టు చేసి సెల్‌పోన్‌ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement