నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని క్యాంటిన్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగులు వచ్చాయని, ఈ పురుగుల అన్నం మాకొద్దని సోమవారం యూనివర్సిటీ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల ఆరోగ్యంలో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లేదని, పురుగుల అన్నం పెడుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అజయ్, సంపత్, సతీష్, విజయ్, వెంకటేష్, సుధీర్, అరవింద్, పృథ్వి, సాయి, గోపి, ప్రణయ్ పాల్గొన్నారు.
ఎంజీయూలో విద్యార్థుల ఆందోళన


