వలిగొండ : అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సూచించారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలో విద్యుత్ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లలో లోపాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటి సరఫరా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ నర్సింహ, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ ప్రశాంత్, పంచాయతీ రాజ్ ఏ ఈ సందీప్ రెడ్డి, ఏఈ రమ్య పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి


