భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించడంలో అలసత్వం వహించవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కోరారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి ప్రజల నుంచి 55 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 40, మున్సిపాలిటీ 5, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, జిల్లా పంచాయతీ 2, జిల్లా విద్యా శాఖ 2, కో–ఆపరేటివ్, ఎస్సీ కార్పొరేషన్, చేనేత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలవి ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టరు భాస్కర్‌రావు


