భువనగిరిటౌన్ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య విమర్శించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శవర్గ సభ్యుడు మాటూరు బాలరాజు అధ్యక్షతన భువనగిరిలో నిర్వహించిన మండల కార్యదర్శులు, శాఖ కార్యదర్శులు, బాధ్యుల సమావేశంలో మాట్లాడారు.మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ఒకేసారి తీసుకురావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. డీ లిమిటేషన్ బిల్లు సాకుతో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకపోవడం మోదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్,పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, జెల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ , బోలగాని జయరాములు, బొడ్డుపల్లి వెంకటేష్, గడ్డం వెంకటేష్ , ఎంఏ ఇక్బాల్, మద్దెపురం రాజు, నాయకులు అవ్వరి గోవర్ధన్, ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, గంటపాక శివ తదితరులు పాల్గొన్నారు.


