క్రీడాంశాలు
● ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్, హాకీ ఐదు క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు.
● ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది.
అర్హులు ఎవరంటే..
● ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది.
పేర్లు నమోదు ఇలా..
● శిబిరాలకు వచ్చే విద్యార్థులు శిక్షకుల వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలి.
● క్రీడా శిక్షణకు వచ్చే విద్యార్థులకు సంబంధించి ప్రతిరోజూ హాజరు తీసుకుంటారు.
ప్రయోజనం..
● పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా, రాష్ట స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.
● శిక్షణ శిబిరాలలో పాల్గొన్న క్రీడాకారులందరికీ చివరి రోజు సర్టిఫికెట్లు అందజేస్తారు.
భువనగిరి : విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకుగాను ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షకుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరించి 10 మందిని ఎంపిక చేసే ప్రక్రియ మొదల పెట్టారు. ఎంపిక పూర్తికాగానే వారికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేయనున్నారు.
రూ.50 వేల నిధులు
క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం జిల్లాకు రూ.50 వేల నిధులు విడుదల చేయనుంది. ఈ నిధుల నుంచి ఒక్కో శిక్షకునికి రూ.4 వేల చొప్పున 10 మందికి రూ.40 వేలు ఇవ్వనున్నారు. మిగిలిన రూ.10 వేలను ప్రథమ చికిత్స, సర్టిఫికెట్స్ కోసం ఖర్చు చేయనున్నారు. జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ అధికారి నిర్వహణ బాధ్యతలతోపాటు పర్యవేక్షించనున్నారు. కాగా శిబిరాలకు వచ్చే విద్యార్థులకు దాతల చేయూతతో స్నాక్స్ ఇవ్వనున్నారు.
క్రీడా శిబిరాలు, శిక్షకులు ఇలా..
● ఖోఖో, మర్యాల జెడ్పీహెచ్‌ఎస్ (బొమ్మలరామారం), గోపాల్ (సెల్ :9492504743)
● అథ్లెటిక్స్, మర్యాల జెడ్పీహెచ్‌ఎస్ (బొమ్మలరామారం), సునిల్ (86883181199)
● ఖోఖో, అనాజీపురం జెడ్పీహెచ్‌ఎఎస్ (భువనగిరి) ఆంజనేయులు (9948825255)
● హాకీ, సంగెం జెడ్పీహెచ్‌ఎస్ (వలిగొండ), సంధ్యారాణి (7732063863)
● ఖోఖో, మాసాయిపేట జెడ్పీహెచ్‌ఎస్ (యాదగిరిగుట్ట), విజయకుమార్ (9848367366)
ఇప్పటికే వేసవి క్రీడా శిబిరాలు నిర్వహణకు పలు స్కూళ్లతోపాటు శిక్షకులను ఎంపిక చేశారు. వాలీబాల్, తైక్వాండో విభాగాలకు సంబంధించి స్కూళ్లతోపాటు శిక్షకులను ఎంపిక చేయాల్సి ఉంది.
ఫ మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ
ఫ జిల్లావ్యాప్తంగా పది శిబిరాలు ఏర్పాటు
ఫ ఐదు క్రీడాంశాల్లో పోటీలు
ఫ 14 ఏళ్లలోపు బాలబాలికలకు అవకాశం


