మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ పూర్తి మద్దతు | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ పూర్తి మద్దతు

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

యాదగిరిగుట్ట: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు దక్షిణాది రాష్ట్రాలకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించి, కాంగ్రెస్‌, మిత్రపక్షాలతో 99శాతం మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు 130వ రాజ్యాంగ సవరణను దేశమంతా చూసిందన్నారు. రాజ్యాంగ సవరణ ముసుగులో దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయాలని మోదీ, అమిత్‌ షా కుట్రలు చేశారని, కానీ దానిని రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే, ప్రియాంకగాంధీలు వీగిపోయే విధంగా చేశారన్నారు. మహిళలను గౌరవించేది కాంగ్రెస్‌ పార్టీనే అని అన్నారు. బీజేపీ చరిత్రలో ఏనాడు మహిళలకు అధ్యక్షత పదవి ఇవ్వలేదని, అలాంటి వారు మహిళలకు పెద్దపీట వేస్తారా అని ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాలను అణచివేయాలని ప్రధాని నరేంద్రమోదీ చూస్తున్నారని విమర్శించారు. దొంగ దీక్షలతో జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను పాకిస్తాన్‌తో బీజేపీ ఎంపీ పోలిస్తే ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ఏ విధంగా ఖూనీ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా బిల్లు పెడితే కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు మద్దతు ఇచ్చేవని, కానీ మహిళ బిల్లును డిలిమిటేషన్‌ పేరుతో ముడి పెట్టారన్నారు. చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. వార్డు మెంబర్‌ స్థాయి లేని వ్యక్తులు కూడా తనను ఆరోపిస్తున్నారని, అంతేకాకుండా కురుమ సంఘ భవనం లీజు విషయంపై తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. సమావేశంలో మదర్‌ డెయిరీ మాజీ చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుండ్లపల్లి వాణి, వైస్‌ చైర్‌పర్సన్‌ బరిగె రమ్య, కౌన్సిలర్లు బూడిద మధు, పెలిమెల్లి లావణ్య, పట్టణ అధ్యక్షులు బందారపు బిక్షపతి, నాయకులు గుండ్లపల్లి భరత్‌, ఎరుకల హేమేందర్‌గౌడ్‌ తదితరులున్నారు.

ఫ ప్రభుత్వ విప్‌

బీర్ల ఐలయ్య

Advertisement
 
Advertisement
Advertisement