పంచభూతాల కలయికే హిందుత్వం | - | Sakshi
Sakshi News home page

పంచభూతాల కలయికే హిందుత్వం

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

చౌటుప్పల్‌ : పంచభూతాల కలయికే హిందుత్వమని త్రైలింగ ప్రాంత సామాజిక సంఘటన సేవాప్రతి వాసుదేవానంద సరస్వతి తెలిపారు. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుదేవానంద సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. హిందుత్వం అంటే సమానత్వమన్నారు. కులాలు ఏవైనా అందరూ కలిసిమెలిసి జీవనం సాగించమని చెప్పేదే హిందుత్వమని తెలిపారు. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్‌ ప్రముఖ్‌ జిన్న సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పౌరులు సన్మార్గంలో నడవాలంటే హనుమాన్‌ చాలిసా చదవాలని, లేదంటే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న శాఖలకు వెళ్లాలని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ సామాజికవేత్త పర్వతం సంధ్యారాణి మాట్లాడుతూ.. మనిషికి నైతిక విలువలు ఎంతో అవసరమని తెలిపారు. ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నా నైతిక విలువలు, క్రమశిక్షణ లేకుంటే జీవితం వ్యర్ధమన్నారు. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు కేవీబీ.కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, సమ్మేళన సమితి ప్రధాన కార్యదర్శి కొసునం రాంరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాసులు, ప్రతినిధులు బడుగు శ్రీ రాములు, పోలోజు రాజుచారి, బడుగు బాలరాజు, సిలివేరు శ్రీనివాస్‌, పోలోజు శ్రీనివాస్‌చారి, కర్నాటి శ్యాంప్రసాద్‌, వేముల నర్సింహ, గుర్రం నర్సింహ, పోలోజు వెంకటాచారి, జక్కర్తి శేఖర్‌ పాల్గొన్నారు.

ఫ త్రైలింగప్రాంత సామాజిక సంఘటన సేవాప్రతి వాసుదేవానంద సరస్వతి

Advertisement
 
Advertisement
Advertisement