డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలన
13 కేంద్రాల్లో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ
సాక్షి, యాదాద్రి: భువనగిరి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు త్వరలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు దక్కనున్నాయి. ప్రధానంగా భువనగిరిలోని సింగన్న గూడెం వద్ద నిర్మించిన 444 డబుల్ బెడ్ రూం ఇళ్లలో మౌలిక వసతులు పూర్తి చేసి, జూన్ మొదటి వారంలో సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనర్హుల తొలగింపు
గడిచిన రెండు నెలలుగా నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడానికి ప్రణాళిక ఖరారు చేశారు. ఈ నెల చివరి నాటికి డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో డ్రెయినేజీ, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మంచినీటి పైప్‌లైన్‌ల వంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా.. లబ్ధిదారుల ఎంపికపై మరోసారి విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
మిగతా మండలాల్లో..
బీబీనగర్ మండలం కొండమడుగులో 24 డబుల్ బెడ్ రూం ఇళ్లు, బీబీనగర్ 10, పోచంపల్లిలో 120, జిబ్లక్ పల్లిలో 24 ఇళ్ల పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. కొండమడుగులో విద్యుత్ స్తంభాలు నాటుతున్నారు. బీబీనగర్ లెప్రసీ కాలనీలో ఉన్న డంపింగ్ యార్డును తొలగించే పనిలో అధికారులు ఉన్నారు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిఽధిలోని రేవణపల్లిలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. అదేవిధంగా జిబ్లక్‌పల్లిలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది.
సాక్షి, యాదాద్రి : కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం జనగణనకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ముందుగా ఇళ్ల లెక్కింపు, ఆ తర్వాత జనాభాను లెక్కించనున్నారు. ఈనెల 26 నుంచి ప్రజలకు స్వీయ గణన నమోదుకు అవకాశం ఇచ్చారు. మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు క్షేత్రస్థాయి గృహాల సమాచారాన్ని సేకరించనున్నారు. 2027 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి జనగణన చేపట్టనున్నారు. ఇందుకోసం సిబ్బందికి ఇప్పటికే పలు దఫాలుగా శిక్షణ ఇవ్వగా.. శనివారం ఎన్యుమరేటర్లకు, సూపర్‌వైజర్లకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
ప్రతి 600 నుంచి 800 మంది జనాభాకు
ఒక ఎన్యుమరేటర్
ప్రస్తుతం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7,70,833 జనాభా ఉండగా, అందులో మహిళలు 3,80,341 కాగా, పురుషులు 3,90,482 మంది ఉన్నారు. 1,88,520 ఇళ్లు ఉండగా ఎఫెక్ సర్వే లెక్కల ప్రకారం 2.14లక్షలు ఉన్నట్లు తేలింది. సర్వే చేసేందుకు ప్రతి 600 నుంచి 800 మంది జనాభాకు ఒక ఎన్యుమరేటర్ ఉంటారు. ప్రతి ఆరుగురు ఎన్యుమరేటర్లను ఒక సూపర్‌వైజర్ పర్యవేక్షిస్తారు. మే 11నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు సర్వే చేయనున్నారు. తొలిదశలో క్షేత్రస్థాయి గృహాల సమాచారాన్ని సేకరిస్తారు. ఈమేరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 104 వార్డులు, 427 గ్రామపంచాయతీలలో ఇళ్ల జాబితాలను రూపొందిస్తారు. ఆయా ఇళ్లలోని కుటుంబాల జీవన స్థితిగతులను గుర్తిస్తారు. ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎన్ని గృహాలు ఉన్నాయో గుర్తించి, ప్రాంతాలవారీగా మ్యాప్‌లను రూపొందిస్తారు. 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్న జనగణన సర్వేలో కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలను నమోదు చేస్తారు. తొలి దశ సర్వేలో నివాస గృహం స్థితి, వాహనాలు, ఆహారపు అలవాట్లతోపాటు 33 రకాల ప్రశ్నలు ఉంటాయి. పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే ఈ సర్వే కొనసాగుతుంది. భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలతోపాటు జిల్లా ప్లానింగ్ అధికారి, డీపీఓ, డీఎఫ్‌ఓ, జెడ్పీ సీఈఓ, డీఐసీ, ఎస్‌ఓ, డీఈఓతో కలిపి 10 మంది అధికారులు ఇళ్ల జాబితా, ఆ కుటుంబాల జీవనస్థితిగతుల నమోదును పరిశీలిస్తారు. జనాభా గణన ప్రధాన అధికారిగా కలెక్టర్ వ్యవహరించనున్నారు. ఆయనకు సహాయ ముఖ్య జిల్లా జనగణన అధికారిగా అదనపు కలెక్టర్ ఉంటారు.
26 నుంచి మే 5 వరకు స్వీయగణన
జనగణనలో తాజాగా స్వీయ గణన నమోదు ప్రక్రియ తీసుకువచ్చారు. ఈనెల 26 నుంచి మే 5వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజలు తమ కుటుంబ వివరాలు, నివాసం వంటి పలు అంశాలు ప్రభుత్వం ఇచ్చిన ఆన్‌లైన్ పోర్టల్ se.census. gov.in లో స్వయంగా నమోదు చేయాలి. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చి అధికారిక వెబ్‌సైట్ లో వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఇంటికి ఒక ప్రత్యేక ఐడీ ఇస్తారు. ఫీల్డ్ ఎన్యుమరేటర్ ఈ డేటా ఐడీని ధ్రువీకరిస్తారు.
నేటి తరానికి స్ఫూర్తిగా భూదాన పాదయాత్ర
17బిఎన్‌జి209–
ఫ జూన్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు
ఫ ఈనెలాఖరులోగా మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలని సూచన
ఫ సింగన్నగూడెం వద్ద ఇళ్ల నిర్మాణ
పనులపై ఎమ్మెల్యే సమీక్ష
ఫ జనగణనలో భాగంగా ముందుగా ఇళ్ల సర్వే, ఆ తర్వాత జనాభా లెక్కింపు
ఫ 26 నుంచి స్వీయగణన నమోదుకు అవకాశం
ఫ వచ్చే నెల 11 నుంచి జూన్ 9 వరకు క్షేత్రస్థాయిలో ఇళ్ల సమాచార సేకరణ
ఫ 2027 ఫిబ్రవరి 10 నుంచి మొదలుకానున్న జనగణన
ఫ నేటి నుంచి మూడు రోజులపాటు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం వద్ద నిర్మిస్తున్న 444 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టు కోసం తక్షణమే రూ. 2.5 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు లేని పేదలకు, మధ్యతరగతి వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, హౌసింగ్ పీడీ, డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
2011 జనాభా లెక్కలు ఇలా..
జనాభా : 7,70,833
మహిళలు : 3,80,341
పురుషులు : 3,90,482
కుటుంబాలు : 1,88,520
జిల్లాలో జనగణనకు సంబంధించి మొదటి దశ శిక్షణ తరగతులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని, క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ప్రధాన జనగణన అధికారి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈనెల 18, 20, 21 తేదీల్లో మొత్తం మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 13 ఛార్జ్ లెవెల్ కేంద్రాల్లో ఈ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమకు కేటాయించిన కేంద్రాలకు నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. జనగణనలో సాంకేతికత వినియోగం పెరిగిన నేపథ్యంలో, మొబైల్ యాప్‌ల నిర్వహణ, డాటా ఎంట్రీ మరియు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై సిబ్బందికి నిపుణులతో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనగణన సమయంలో పాటించాల్సిన విధివిధానాలు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ స్పష్టత కలిగి ఉండాలని పేర్కొన్నారు. జనగణన దేశ భవిష్యత్ ప్రణాళికలకు కీలకమైనదని, ఇందులో ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.


