రామన్నపేట: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి ఈనెల 13న దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు అడ్మిషన్ల వేటలో పడ్డాయి. ప్రభుత్వ కళాశాలలు సైతం ప్రైవేట్‌కు దీటుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాయి.
మొత్తం 59 డిగ్రీ కళాశాలలు
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 59 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 11 ప్రభుత్వ కళాశాలలు, రెండు ఎయిడెడ్, 46 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. యూనివర్శిటీ ఆయా కళాశాలల ద్వారా సుమారు 45కి పైగా కోర్సులను తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. వాటిలో ప్రధానంగా బీఏలో హెచ్‌ఈఎంజే, హెచ్‌ఈపీఎ, హెచ్‌పీపీ, హెచ్‌ఈపీ, ఈపీపీ, హెచ్‌పీజీ, టీహెచ్‌పీ, ఈహెచ్‌పీ కోర్సులు, బీకాంలో కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు, బీఎస్సీలో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంసీసీ, బీజెడ్‌సీ, డీజెడ్‌సీ, బీజెడ్‌సీఎస్ వంటి కోర్సులు ఉన్నాయి.
ఫ 13న విడుదలైన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్
ఫ జూన్ 1 వరకు అడ్మిషన్ల ప్రక్రియ
ఫ జూలై 1 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు
దోస్త్ షెడ్యూల్ ఇలా.. మొదటి దశ రెండవ దశ మూడో దశ
రిజిస్ట్రేషన్లు (ఏప్రిల్ 15 – మే 7) మే 15 – 25 వరకు మే 31– జూన్ 15
రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 రూ.400 రూ.400
వెబ్ ఆప్షన్ల నమోదు ఏప్రిల్ 30 – మే 8 మే 15– 26 వరకు మే 31 – జూన్ 16
సీట్ల కేటాయింపు మే 14 మే 30 జూన్ 20
కళాశాలల్లో చేరాల్సింది మే 15 – 25 లోపు మే 31 – జూన్ 5లోపు జూన్ 20 – జూన్ 25లోపు


