భూదాన్‌పోచంపల్లి : భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్తాలో ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. వెదిరె రామచంద్రారెడ్డి సేవాసమితి, సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించనున్నట్లు ఆలిండియా సర్వోదయ మండలి అధ్యక్షుడు వెదిరె అరవిందారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ.. భూదాన వజ్రోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆలిండియా సర్వసేవా సంఘ్ మేనేజింగ్ ట్రస్ట్ మహాదేవ్ విద్రోహి, సర్వోదయ మండలి అధ్యక్షుడు తురుపునూరి కృష్ణ, వెదిరె రాంచంద్రారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య, కొమ్ము లక్ష్మణ్, కరగళ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.


