వేములపల్లి, రామగిరి(నల్లగొండ): వేములపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో 13వ శతాబ్దం నాటి ద్వార పాలకుడి విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర అన్వేషణ బృదం సభ్యుడు రాగి మురళి గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న విగ్రహాన్ని ఆయన పరిశీలించి విశ్రాంత పురావస్తు అధికారి ఈమని శివానాగిరెడ్డితో మాట్లాడి వివరాలు తెలియజేశారు. ఈ విగ్రహం శివాలయాల ముందు ఉండే ద్వార పాలకుడిదని, విగ్రహం అంసంపూర్తిగా ఉందన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయని.. మనకు వాటి గురించి తెలియక ధ్వంసం చేస్తుండడంతో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు.


