భూదానంతో దేశానికి ఘన కీర్తి | - | Sakshi
Sakshi News home page

భూదానంతో దేశానికి ఘన కీర్తి

Apr 17 2026 10:20 AM | Updated on Apr 17 2026 10:20 AM

భూదాన్‌పోచంపల్లి: వెదిరె రాంచంద్రారెడ్డి భూదానంతో పోచంపల్లికి, దేశానికి ఘన కీర్తి వచ్చిందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని కస్తూర్బా ప్రకృతి చికిత్సాలయం నుంచి పోచంపల్లి వరకు సంఘమిత్ర సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల భూదానోద్యమ స్ఫూర్తి పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ ససందర్భంగా మాట్లాడుతూ.. పోచంపల్లిలో ఈనెల 18న భూదానోద్యమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోచంపల్లిలో నిర్వహిస్తున్న వజ్రోత్సవాలకు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ తదితరులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లు, సంఘమిత్ర సంస్థ ప్రతినిధులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్‌, తడక రమేశ్‌, భారత లవకుమార్‌, తడక లావణ్య, కొయ్యడ నర్సింహ, గుజ్జ సత్యం, పారిజాత, చక్రాల నర్సింహ, పిల్లలమర్రి దేవేందర్‌, రాపోలు జ్ఞానేశ్వర్‌, చింతకింది రమేశ్‌ పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement