నకిరేకల్ : ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ సర్పంచులు ఉన్న చోట స్థానికంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని ఆహ్వానించకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, కానీ గడిచిన 40 రోజుల ప్రణాళికలో ఏం సాధించారని ప్రశ్నించారు. చిన్నచిన్న కారణాలతో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో తూకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అదనపు తూకాలను నిలిపివేయకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, నకిరేకల్, కేతేపల్లి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, సర్పంచ్ గోర్ల వీరయ్య, కౌన్సిలర్ పల్లె విజయ్, నాయకులు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, రావిరాల మల్లయ్య, గుండగోని జంగయ్య, దైద పరమేషం పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


