జిల్లాల వారీగా జనాభాతో పోల్చితే యాదాద్రి భువనగిరి జిల్లాలోనే బీసీల శాతం ఎక్కువగా ఉన్నారు. సంఖ్యా పరంగా మాత్రం నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో సంఖ్యా పరంగా ఎక్కువే అయినా మొత్తం జనాభాలో బీసీలు 54 శాతం ఉండగా, సూర్యాపేటలో 52 శాతం ఉన్నారు. ఇక యాదాద్రిలో అత్యధికంగా 63 శాతం మంది బీసీలు ఉన్నట్లు తేలింది.
గ్రామీణ ప్రాంతాల్లో
అత్యధిక జనాభా
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా జనాభా ఉంది. అన్ని సామాజిక వర్గాల్లోనూ ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా అన్ని సామాజిక వర్గాల్లోనూ తక్కువే.
టాయిలెట్ సదుపాయం ఉన్న కుటుంబాల శాతం
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ
నల్లగొండ 69.8 79.7 88.5 86 91 94.3 86.6 92.6 93.8
సూర్యాపేట 68.7 73 84.6 81.9 85.7 87 83.7 88.7 92.8
యాదాద్రి 86.4 88.4 93.8 90.7 95.2 98.5 93.4 92.1 95.9


