భూదాన్‌పోచంపల్లి: మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని ఏడుగురు మహిళా రైతులకు పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా సబ్సిడీపై మంజూరైన ప్యాడీ క్లీనర్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి పథకం మహిళల పేరిటే అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ఉత్తమ ఇంద్రియాల వీఓఏ లక్ష్మితో పాటు ఆయా బ్యాంకు మేనేజర్లను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, అడిషనల్ డీఆర్‌డీఓ కోట జంగారెడ్డి, తహసీల్దార్ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, ఏఓ శైలజ, డీపీఎం రవీందర్, ఏపీఎం తవుర్యానాయక్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పారిజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశ్ పాల్గొన్నారు.


