సాక్షి ప్రతినిధి, నల్లగొండ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కులాల వారీ జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే (ఎస్‌ఈఈఈపీఎస్–2024) ప్రకారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఎంత మంది బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారనే లెక్కలు ఉపకులాల వారీగా వెల్లడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వెనుకబడిన వర్గాలు (బీసీ) 56 శాతం ఉండగా, ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 12.45 శాతం, ఓసీలు 11.70 శాతం ఉన్నారు. ఇక, అటు బీసీల్లోనూ, ఓసీల్లోనూ ఉన్న ముస్లిం మైనార్టీలు 5.50 శాతం ఉన్నారు. అయితే, గతంలో ఎప్పుడు జనాభా లెక్కలు జరిగినా కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు మాత్రమే వెల్లడించేవారు కానీ, ఈసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే అనంతరం తొలిసారి ఉపకులాల వారీగా బీసీ, ఓసీల లెక్కలు కూడా స్పష్టంగా తేలడం గమనార్హం.
సామాజికవర్గాల వారీగా జనాభా
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఓసీ అన్నీ కలిపి
(బీసీలో ఓసీలో కలిపి)
నల్లగొండ 3,14,670 2,29,625 7,86,788 94,613 1,78,043 16,03,739 సూర్యాపేట 2,21,989 1,50,665 5,01,982 66,277 1,31,376 10,72,289
యాదాద్రి 1,54,021 52,686 4,80,978 30,444 85,900 8,04,029
సామాజికవర్గాల వారీగా గ్రామీణ జనాభా
నల్లగొండ 259196 216296 615509 36296 120982 1248279
సూర్యాపేట 176461 134204 380959 36817 88875 817316
యాదాద్రి 129245 50575 386267 15,641 71303 653031
సామాజిక వర్గాల వారీగా పట్టణ జనాభా
నల్లగొండ 55474 13329 171279 58317 57061 355460
సూర్యాపేట 45528 16461 121023 29460 42501 254973
యాదాద్రి 24776 2111 94711 14803 14597 150998


