ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీలే అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం జనాభా 34,80,057 కాగా, అందులో బీసీలు 19,48,993 మంది ఉన్నట్లు తేలింది. ఎస్సీలు 6,90,680 మంది ఉండగా, ఎస్టీలు 4,32,976 మంది ఉన్నారు. ఓసీలు 4,07,408 మంది ఉన్నారు. ఇక బీసీ, ఓసీల్లోని ముస్లింలు 1,91,334 మంది ఉన్నట్లు తేలింది. అందులో బీసీ ముస్లింలే అత్యధికంగా ఉండగా, ఓసీల్లో ముస్లింలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నల్లగొండ జిల్లాలో బీసీ ముస్లింలు ఎక్కువ మంది ఉండటం గమనార్హం.


