సామాజిక వర్గాల పరంగా చూస్తే లింగ నిష్పత్తిలో చాలా తేడాలు ఉన్నాయి. కొన్ని సామాజిక వర్గాల్లో ప్రతి వేయి మంది పురుషులకు మహిళల సంఖ్య తక్కువగా ఉండగా.. కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం జనాభా పరంగా చూస్తే మాత్ర లింగ నిష్పత్తి తక్కువే ఉన్నట్లు తేలింది. ప్రతి వేయి మందికి నల్లగొండలో 969 మంది మహిళలు, సూర్యాపేటలో 989 మంది, యాదాద్రిలో 974 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అదే ఓసీల్లో చూస్తే మాత్రం మూడు జిల్లాల్లో మహిళ నిష్పత్తి ఎక్కువగా ఉంది.
సామాజికవర్గాల వారీగా.. సొంతిళ్లు కలిగిన వారి శాతం
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ
నల్లగొండ 84.4 80.0 81.2 79.8 81.9 74.3 84.9 65.1 83.2
సూర్యాపేట 79.5 70.2 73.7 70.4 76.0 57.0 76.2 61.2 76.8
యాదాద్రి 73.8 72.2 72.7 69.7 73.4 62.1 75.2 55.9 76.9
ఇళ్లు లేని వారి శాతం
నల్లగొండ 6.1 6.3 3.5 4.5 3.3 2.1 3.6 2.2 2.1
సూర్యాపేట 7.5 9.2 5.8 6.9 5.6 5.7 5.8 5 3.4
యాదాద్రి 6.1 6.2 4.0 5.1 3.7 2.3 3.8 3.9 3.3


