రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

మోత్కూరు : మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో వలిగొండ–తొర్రూరు ప్రధాన రహదారిపై వరుసగా రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. మంగళవారం హయత్‌నగర్‌కు చెందిన ఐదుగురు తెల్లవారు జామున తొర్రూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలడుగు శివారులో కారు అదుపుతప్పింది. అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా వెళ్తున్న బైక్‌ను మరో బైక్‌ ఢీ కొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement