సెన్సార్‌ బోర్డులో భువనగిరి వాసికి కీలక బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

సెన్సార్‌ బోర్డులో భువనగిరి వాసికి కీలక బాధ్యతలు

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

భువనగిరిటౌన్‌ : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ అడ్వైజరీ ప్యానెల్‌ సభ్యుడిగా భువనగిరికి చెందిన మెరుగు మధు నియామకమయ్యారు. ఈ మేరకు సీబీఎఫ్‌సీ హైదరాబాద్‌ ప్రాంతీయ అధికారి రాహుల్‌ గోవిల్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో మెరుగు మధు మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. సినిమా రంగానికి సంబంధించిన కీలక బాధ్యతల్లో నియామకం కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ మెరుగు మధుకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

సేంద్రియ పంటల

సాగుపై అవగాహన

చౌటుప్పల్‌ : మండల పరిధిలోని తమ్మలోనిబావి గ్రామంలో వాకిటి రజితారెడ్డి–రాజేందర్‌రెడ్డిలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను మంగళవారం హైదరాబాద్‌లోని ఫనినీయ మహావిద్యాలయానికి చెందిన విద్యార్థులు పరిశీలించారు. రసాయన, పురుగు మందులు వాడకుండా పంటల సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఉషారాణి, డీన్‌ నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement