తిప్పర్తి : అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాలను మంగళవారం ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఓ వ్యక్తి అభివృద్ధి చెందాలంటే చదువు తప్పనిసరి అని చెప్పారని పేర్కొన్నారు. అందరికీ ఓటు హక్కు, చదువు కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ చదువుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తిప్పర్తి మండలంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, రూ.పది కోట్లతో మండల కేంద్రంలో సుందరీకరణ పనులు చేపట్టామని తెలిపారు. ఏఎమ్మార్పీ క్వాలకు రూ.450 కోట్లతో లైనింగ్ పనులు చేపట్టామని, ఆ పనులు పూర్తయితే చివరి భూములకు నీరు అందుతుందన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ సభకు తిప్పర్తి సర్పంచ్ బద్దం రజితసుదీర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీదర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ గణేష్, ఏఈ గౌస్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యాంసుందర్, నాయకులు పాశం సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
తిప్పర్తి సర్కిల్‌లో అంబేడ్కర్,
జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణ


