● అంబేద్కర్ వేషధారణలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం
సూర్యాపేట టౌన్ : డ్రగ్స్, గంజాయి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం అంబేద్కర్ వేషధారణతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.


