భూదాన్‌పోచంపల్లి: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని త్రిలింగ ప్రాంత సామాజిక సేవాప్రతి వాసుదేవానంద సరస్వతీ స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ సమాజంలో గౌరవం, ఐక్యమత్యం, అంకితభావం, సేవా గుణం, దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలో కులాలు వేరైనా మనమంతా హిందువులమనే ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. తద్వారా దేశ నిర్మాణం పటిష్టమవుతుందన్నారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సహకార్యవాహ్ ఉప్పలంచ మల్లికార్జున్, రాష్ట్ర సేవికా సమితి కార్యవాహిక కటకం పావని, డాక్టర్ దేవరాయ స్వామి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్‌పర్సన్ కొయ్యడ రజిని శ్రీనివాస్, సీత శ్రీరాములు, కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివ, చిక్క కృష్ణ, హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు రుద్ర పాండురంగశాస్త్రి, ప్రధానకార్యదర్శి కొమ్ము లక్ష్మణ్, కోశాధికారి సాయిని భాస్కర్, ఉపాధ్యక్షులు సీత సత్యనారాయణ, చక్రాల నర్సింహ, ఎస్. సత్యనారాయణ, వంగూరి స్వామి, గునిగంటి మల్లేశం, శ్రీనివాసశర్మ, రుద్ర వెంకటేశం, బాలనర్సింహ, గునిగంటి రమేశ్, వెంకటేశ్, బల్ల దుర్వాసులు, చిట్టిమల్ల లక్ష్మినారాయణ, జల్ది నర్సింహ పాల్గొన్నారు.


