దేవరకొండ : పార్లమెంట్‌లో మహిళా బిల్లుతో పాటు బీసీ మహిళలకు చట్టసభల్లో సబ్ కోటా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి మహిళలకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటే జనాభా దామాషా ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో చేరిపల్లి జయలక్ష్మి, ముత్తమ్మ, వనం చంద్రకళ, శారద, శివ తదితరులు పాల్గొన్నారు.


