బైక్‌పై నుంచి కిందపడి.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి కిందపడి..

Apr 14 2026 7:10 AM | Updated on Apr 14 2026 7:10 AM

బైక్‌పై నుంచి కిందపడి..

త్రిపురారం : ౖబెక్‌పై నుంచి కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం జరిగింది. సోమవారం త్రిపురారం ఎస్‌ఐ గైకూరి నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన బొడ్డుపల్లి భద్రయ్య(50) ఆదివారం పని నిమిత్తం అడవిదేవులపల్లికి వెళ్లి రాత్రి తిరిగి మిర్యాలగూడకు వెళ్తుండగా.. త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు వెంట ఉన్న రాయి తగిలి బైక్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సోమవారం మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఒక కుమార్తె ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement