చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌ తిప్పలు | - | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌ తిప్పలు

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ పట్టణంలో జాతీయ రహదారితోపాటు సర్వీస్‌ రోడ్లపై ఆదివారం ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వివాహాలు, ఇతర శుభకార్యాలు అత్యధికంగా ఉండడం..వీకెండ్‌ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు సాగించారు. దీనికి తోడుగా పట్టణంలో అండర్‌పాస్‌ నిర్మాణ పనులు సాగుతుండడంతో విజయవాడ మార్గంలో నవో దయ టాకీస్‌ నుంచి, హైదరాబాద్‌ మార్గంలో తంగడపల్లి చౌరస్తా నుంచి సర్వీస్‌ రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో హైవేపై వచ్చే వాహనాలకు తోడుగా స్థానిక వాహనాలు పెద్దసంఖ్యలో రాకపోకలు సాగించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. హైదరాబాద్‌ మార్గంలో లింగోజిగూడెం శివారు వరకు, విజయవాడ మార్గంలో లక్కారం శివారు వరకు వాహనాలు బారులుదీరాయి. సాయంత్రం వరకు కొంత మేరకు రద్దీ తక్కువగానే ఉన్నా రాత్రి మాత్రం హైదరాబాద్‌ మార్గంలోనే భారీగా పెరిగింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. సర్వీసు రోడ్ల వెంట ఉన్న దుకాణాలు, ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement