వలిగొండ : దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. వలిగొండ మండలం కేర్చుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు కొమురయ్య అని గుర్తు చేశారు. కొమురయ్య నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు అని కొనియాడారు. అనంతరం కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్యామ మల్లేశం, మాజీ ఎంపీపీ నూతి రమేష్, సర్పంచ్ మద్దెల మంజుల, కొనపురి కవిత, వెంకటేశం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


