నల్లగొండ : ఇంటర్ ఫలితాల్లో నల్ల గొండలోని గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో కె. సుదీక్ష, కె. హాసిని, బుర్రి కావేరి 468 మార్కులు, జుహనూరిన్, నలహిదా తన్వీర్, కె. హరిని, ఎన్. ప్రసన్న, పి. రమ్య, డి. ప్రవళిక, ఎ. వర్ష, ఎం. శివాని, యశ్వంత్‌రెడ్డి 467 మార్కులు సాధించారు. బైపీసీలో ఆర్. జ్యోతిక 438, డి. రేశ్మాదేవి, పి. ప్రసన్న, ఎం.గాయత్రి, కె. హనీషా, ఎ. స్పందన 437 మార్కులు పొందారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో జె. అనూష, పి.శ్రీచరణ్ 992 మార్కులు, ఎన్. తేజస్విని, కె.అనుష్క, డి.స్పందన, ఎం.అర్జున్, పవన్‌కుమార్‌రెడ్డి 991 మార్కులు సాధించారు. బైపీసీలో వి. ప్రణవిక 993 మార్కులు, సమమా సీరెన్, కె. సాత్విక, కె. దీక్షిత, ఎస్. నిఖిత 992 మార్కులు, ఎన్. సతీష్‌కుమార్ 991 మార్కులు పొందారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను కళాశాల డైరెక్టర్లు కాసర్ల వెంకట్‌రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్‌రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు.


