నల్లగొండ : పట్టణంలోని గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో బి. అర్చిత 994 మార్కులు, వి. శ్వేత, ఆర్. ప్రజ్ఞిత 993, బి. శ్రీవిద్య, కె. ఉమారాణి 992, ఎస్. సాయిమాధురి, కె. నిఖిల్‌కుమార్ 991, ఎస్. జగదీష్ 990 మార్కులు సాధించారు. బైపీసీలో ఆర్. ప్రవల్లిక, కె. వెరోనిక రాణి 988 మార్కులు, డి. చరణ్‌తేజ 987, టి. సింధు 981, ఎం. మంజుల 981, ఎల్. మీనా 980 మార్కులు సాధించారు. అదేవిధంగా ఫస్టియర్ ఎంపీసీలో సీహెచ్. సందీప్‌రెడ్డి, షేక్ సానియా, ఎస్. తులసి 466 మార్కులు, ఎన్. వంశీ, శైలజ 465 మార్కులు పొందారు. బైపీసీలో బి. నవ్య 437, కె. అంజలి, సీహెచ్. వరలక్ష్మి, ఎన్. అనూష 436, జి. హని వర్షిత 435 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ టి. నరేందర్‌రెడ్డి, డైరెక్టర్లు సీహెచ్.మల్లారెడ్డి, ఎ.విమోచన్‌రెడ్డి, కె.రాజేందర్‌రెడ్డి, ఎ.జనార్దన్‌రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.


