యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఆలయ మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదానికి గురైంది. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌కు చెందిన తరుణ్, అతడి కుటుంబ సభ్యులు నలుగురు కలిసి కారులో ఆదివారం ఉదయం యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం పూర్తయిన తర్వాత కారులో మొదటి ఘాట్ రోడ్డు నుంచి కిందకు దిగుతుండగా.. జీయర్ కుటీర్ వద్దకు రాగానే టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి ఘాట్ రోడ్డు ప్రహరీని ఢీకొట్టింది. కారులోని భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును ట్రాఫిక్ పోలీసులు మరో వాహనం సహాయంతో కొండ కిందకు తీసుకెళ్లారు.
ప్రహరీని ఢీకొట్టిన కారు


