‘జయ’కేతనం ఎగురవేసిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

‘జయ’కేతనం ఎగురవేసిన విద్యార్థులు

Apr 13 2026 7:08 AM | Updated on Apr 13 2026 7:08 AM

సూర్యాపేటటౌన్‌ : ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో టి. భూమిక, జి. శివమణి 468 మార్కులు, బి. సాయి, ఎల్‌. సంజన, ఎం. అనన్య, పి. సాయిలిక్షిత, ఎస్‌. మాధురి, ఎ. సాయిచర్విత, టి. సాయిహర్షిత 467, జి. సాయిప్రణవి, వై. భావన, ఎన్‌. దీక్షిత, ఎస్‌. మాన్విత, కె. సంజన 466, బి. విశ్వసేనాగౌడ్‌, కె. సాయిరెడ్డి, వి. హాసిని, కె.చరణ్య 465 మార్కులు సాధించారు. 460పైగా 43 మంది, 450పైగా 84 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌ తెలిపారు. బైపీసీ విభాగంలో ఎం. ప్రగతి ఇవాంజలిన్‌ 438 మార్కులు సాధించింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో డి. సిరి 994, జి. శ్రీనిక, ఎం. భవ్యశ్రీ 992, ఎస్‌. అశువర్ధన్‌, జి. మనోవర్షిత 991, ఎండీ ముస్కాన్‌ 990, సీహెచ్‌. జయశ్రీ 989, ఎస్‌కే సాధియా ఇర్ఫానా, జి. శ్రీజ, ఎం. తీర్థశ్రీ, డి. వెన్నెల 988, టి. తేజస్వి, ఎన్‌. శ్రీలక్ష్మి, కె. స్లేష్మ 987, ఎన్‌. హారిణి 985 మార్కులు సాధించినట్లు చెప్పారు. 980 మార్కులకు పైగా 32 మంది, 950 పైగా 107 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. బైపీసీలో కె. శృతి 985, జె. మానస 981, జె. శ్రీనిత్య 980 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్‌తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినంధించారు.

Advertisement
 
Advertisement
Advertisement