కళలతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం | - | Sakshi
Sakshi News home page

కళలతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం

Apr 13 2026 7:08 AM | Updated on Apr 13 2026 7:08 AM

భూదాన్‌పోచంపల్లి : కళలతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్య అన్నారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో స్టూడెంట్‌ యాక్టివిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో శ్రీకళాకృతీయ ఆర్ట్‌ ఫెస్టివల్‌శ్రీ నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌కు యూనివర్సిటీ అడ్వైజర్‌ అయిన పూనం మాలకొండయ్య హాజరై విద్యార్థులు ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కళల పట్ల ఆసక్తి పెంచుకోవడం ద్వారా సృజనాత్మక ఆలోచనలతో పాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. కళా నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. మార్కులు, ర్యాంకులే కాకుండా కళలలో కూడా విద్యార్థులు రాణించాలని అన్నారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దాసేశ్వర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే కళాకృతియ ఆర్ట్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసి కళలలో కూడా విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు రూపొందించిన పెయింటింగ్స్‌, హ్యాండ్‌మేడ్‌ వస్తువులు, మట్టి పాత్రలు, గృహాలంకరణ వస్తువులు, లైవ్‌ మ్యూజిక్‌తో పాటు ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి

పూనం మాలకొండయ్య

Advertisement
 
Advertisement
Advertisement