వ్యాపారంగా మారుతున్న విద్యారంగం | - | Sakshi
Sakshi News home page

వ్యాపారంగా మారుతున్న విద్యారంగం

Apr 13 2026 7:08 AM | Updated on Apr 13 2026 7:08 AM

నార్కట్‌పల్లి : దేశంలో విద్యారంగం వ్యాపారంగా మారుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో మాజీ వైస్‌ ఎంపీపీ, సీపీఎం మండల కమిటీ సభ్యుడు కల్లూరి యాదగిరి స్మారక స్తూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అందరికీ విద్య ఉచితంగా అందించాలని సీపీఎం పోరాటం చేస్తోందన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని అన్నారు. నేటి యువత డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు రాక కూలీలుగా మారుతున్నారన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాలే నేటి ప్రభుత్వాలకు ఎజెండాలుగా మారుతున్నాయని, పేదలకు గుండె బలం కమ్యూనిస్టులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, దండు నాగరాజు, కందాల ప్రమీల, సయ్యద్‌ హాశం, జిట్ట సరోజ, జిట్ట నగేష్‌, చింతపల్లి బయ్యన్న, ఎస్సార్‌ వెంకటేశ్వర్లు, ఇల్లందుల లింగస్వామి, బత్తుల అనంతరెడ్డి, చెరుకు పెద్దులు, కుమ్మరి శంకర్‌, దండు రవి, కొప్పు శ్రవణ్‌ పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Advertisement
 
Advertisement
Advertisement