యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

Apr 11 2026 10:04 AM | Updated on Apr 11 2026 10:04 AM

భువనగిరి : యోగాతో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హోమియోపతి వైద్యశాస్త్ర పితామహుడు డాక్టర్‌ సీఎస్‌ శ్యామ్యూల్‌ హనిమన్‌ జయంతిని పురస్కరించుని శుక్రవారం భువనగిరి కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన ఆయూష్‌ అండ్‌ హోమియోపతి దినోత్సవంలో ఆయన మాట్లాడారు. యోగాభ్యాసం వల్ల ఏకాగ్రత, రోగ నిరోదక శక్తి పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు యోగా సాధన అలవాటుగా చేసుకోవాలన్నారు. అనంతరం ఉచిత హోమియోపతి, యునాని వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పాండునాయక్‌, డాక్టర్‌ సంగీత, బాలభవాని, విజయలక్ష్మి, శ్రీనివాస్‌, కవిత, రోజ్‌మేరీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement