యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో డిజిటల్ సేవలను ఢిల్లీకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈ గవర్నెన్స్ అధికారుల బృందం శుక్రవారం పరిశీలించింది. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రదానం చేసే జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డుల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మికత, పర్యాటక కేటగిరీలో తెలంగాణ నుంచి ఎంపికై ంది. ఈ నేపథ్యంలో దేవస్థానంలో అమలవుతున్న ఈ ఆఫీస్, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సేవలను, ఈ హుండీ, కంప్యూటరైజేషన్, కియాస్క్ మిషన్ల ద్వారా భక్తులు పొందుతున్న సేవలు, వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. భవిష్యత్తులో పూర్థిస్థాయి డిజిటలైజేషన్ చేసేంఉదకు కలిగి ఉన్న అవకాశాలను, తదితర పరిపాలన నిర్వహణ తీరును పరిశీలించి నివేదికను రూపొందించారు. యాదగిరి దేవస్థానం అవార్డుకు ఎంపిక అయ్యేందుకు పూర్థి స్థాయి అవకాశాలు ఉన్నాయని పరిశీలనకు వచ్చిన అధికారులు రాకేష్, రాజేష్‌లు తెలిపారు. దేవస్థానంలో అమలవుతున్న సేవలన్నీ సంతృప్తిని ఇచ్చాయని పేర్కొన్నారు.


