భార్య పుట్టింటికి వెళ్లడంతో.. | - | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లడంతో..

Apr 11 2026 7:28 AM | Updated on Apr 11 2026 7:28 AM

నూతనకల్‌ మండల పరిధిలోని పెదనెమిల గ్రామానికి చెందిన చింతమళ్ల కార్తీక్‌(28) కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థలతో అతడి భార్య మౌనిక తన పిల్లలను తీసుకొని రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన కార్తీక్‌ ఇంటిలో ఉరివేసుకున్నాడు. పక్క ఇంటిలో నిద్రిస్తున్న తల్లి రామనర్సమ్మ చూసి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి అతడిని కిందకి దించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లి రామనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement