ఆంధ్రా ధాన్యం
వచ్చింది..
మిర్యాలగూడ: యాసంగి సీజన్‌లో కోతలు ప్రారంభం కావడంతో మిర్యాలగూడ పరిసర ప్రాంతాలతోపాటు ఉమ్మడి నల్లగొండ నుంచి మిర్యాలగూడ రైస్ మిల్లులకు ధాన్యం భారీగా వస్తోంది. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి డీసీఎం లారీల ద్వారా ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీప ప్రాంతాల రైతుల పేరుతో మిర్యాలగూడ రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. రూ.1800 నుంచి రూ.2వేల వరకు కొనుగోలు చేసి మిల్లులకు క్వింటాకు రూ.2200 చొప్పున బస్తాతో సహా మిల్లు వద్దకు చేరుస్తున్నారు. దీంతో మిల్లర్లు స్థానిక రైతుల నుంచి పచ్చ గింజ, తాలు ఎక్కువగా ఉందనే సాకుతో ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన ధాన్యం తెచ్చినప్పటికీ మిల్లర్లు సిండికేట్‌గా మారి కొర్రీలు పెట్టి ధరలను తగ్గించి రైతులను మోసగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో మిషన్ల ద్వారా కోసిన ధాన్యాన్ని వెంటనే విక్రయించుకోక తప్పడం లేదని పేర్కొంటున్నారు.
గత్యంతరం లేక మిల్లర్లు చెప్పిన ధరకే..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు నుంచి సన్న రకం ధాన్యాన్ని అక్కడి దళారుల ద్వారా మిర్యాలగూడ రైస్ మిల్లులకు రోజుకు సుమారు 300 డీసీఎంలు, లారీల ద్వారా ప్రతిరోజు రైస్ మిల్లులకు చేరుతున్నాయి. గత 25రోజుల క్రితం క్వింటాకు రూ.2750కు పైగా ధర పలకగా ఆంధ్రా ధాన్యం రావడంతో ప్రస్తుతం రూ.2350, రూ.2450 నిర్ణయించారు. గత్యంతరం లేక మిల్లర్లు చెప్పిన ధరకే రైతులు అమ్మాల్సి వస్తోంది. అమ్మిన ధాన్యానికి కూడా డబ్బులు ఇవ్వకుండా 15రోజులు, నెల వాయిదాలతో తెల్ల చీటిపై రాసి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఫ రైతుల పేరిట రైస్ మిల్లులకు
ధాన్యం తరలిస్తున్న దళారులు
ఫ స్థానిక రైతుల ధాన్యానికి
ధర తగ్గిస్తున్న మిల్లర్లు


