చిట్యాల : మండలంలోని పిట్టంపల్లి గ్రామ పరిధిలోని నోష్ ల్యాబ్స్ రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ల వద్ద గురువారం సాయంత్రం మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పరిశ్రమలోని బ్లాక్–2లో ల్యాబ్స్‌లోని రియాక్టర్‌ల వద్ద అకస్మాత్తుగా మంటలు లేచాయి. దీంతో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును పరిశ్రమ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.
ఫ ఇద్దరు కార్మికులకు గాయాలు


